నిజం..ఈ సినిమా చూడటం మనందరి 'కర్తవ్యం’

updated: March 20, 2018 12:25 IST
నిజం..ఈ సినిమా చూడటం మనందరి 'కర్తవ్యం’

కొన్ని సినిమాలు చూడగానే మనస్సులో అలజడి బయిలుదేరుతుంది.. నిజమే కదా.. మనం ఉంటుంది ఇలాంటి సమాజంలోనే కదా అని తలవంచుకోవాలనిపిస్తుంది. వేరే గ్రహం మీదకు వెళ్లి మరీ పరిశోధనలు చేస్తున్న మనం...మన ఇంటిప్రక్కనే ఉన్న సమస్యలను ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం అని నిలదీసి మనని మననే అడగాలిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు..సమస్యా పరిష్కార దిశగా అడుగులు వేద్దాం అని ధైర్యం చెప్పాలనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు రేకిత్తించే  సినిమాలు అరుదుగా వస్తాయి.అప్పుడప్పుడూ వచ్చే ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన భాధ్యత మనపై ఉంది. లేకుంటే ఎంతకాలమైనా మన చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి..ఫాంటసీలోకి తీసుకెళ్లే సినిమాలతోనే గడిచిపోతోంది.  అలాంటి ఆలోచనలలో పడేసే సినిమా నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం. 

నిర్మాత , శరత్ మరార్ 

ఓ మంచి సినిమాకు నిర్వచనం గా అనపించే ఈ సినిమా... చుట్టూ ఉన్న  సమాజం నుంచి.. జనాల నుంచి..  అనుభవాల నుంచి.. కష్టాలు కన్నీళ్ల నుంచి పుట్టింది. ఒక పక్క కొన్ని వేల కిలోమీటర్ల  దూరంలో ఉన్న అంతరిక్షంలోకి రాకెట్‌ లను పంపుతున్నా,  వంద అడుగుల బావిలో పడ్డ పాపను కాపాడేందుకు  సరైన పరిజ్ఞానం లేని పరిస్థితులను ఆలోచింప చేసే విధంగా ఎత్తి చూపించారు. ఒక బిడ్డ బోరు బావిలో పడిపోతే కాపాడలేని మన నిశ్సహాయిత, దైన్యం గురించి ధైర్యంగా   ప్రశ్నిస్తుందీ సినిమా. సమస్యలు... చర్చ అంటున్నారు కదా ఇది ఏదో ఓ డాక్యుమెంటరి టైప్ సినిమా అనుకోవద్దు. ఎక్కడా పట్టు సడలని స్క్రీన్ ప్లేతో, ఉత్కఠం,ఉద్వేగం కలిగిస్తూ రెండు గంటలు పాటు తల తిప్పుకోనివ్వని సోషయో థ్రిల్లర్ ఈ సినిమా. 


ఈ  చిత్రాన్ని  నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరద్ మరార్ అందించారు . ఎక్కడా రాజీపడని డబ్బింగ్ క్వాలిటితో సినిమాని రూపొందించారు. సమాజం పట్ల ఒక బాధ్యతతో ఆయన ఈ  సినిమా అందించిన  విషయం అర్థమవుతుంది. కాకాముట్టై ఫేం రమేష్ మరియు విఘ్నేష్, సును లక్ష్మీ, రామచంద్రన్ దురైరాజ్ కీలక పాత్రలు పోషించారు. చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. 

 ‘కర్తవ్యం’ కచ్చితంగా చూడదగ్గ సినిమాకాదు..చూసితీరాల్సిన సినిమా.. మరిన్ని మంచి సినిమాలు,ఆలోచింప చేసే సినిమాలు కోసం ఈ సినిమాని ఆదరించటం  మనందరి కర్తవ్యం.
 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: kartavyam movie, nayanatara, sharath marar

comments