గాంధీయిజం ...పై గౌరవం రెట్టింపు చేసే సినిమా

updated: March 4, 2018 18:18 IST
గాంధీయిజం ...పై గౌరవం రెట్టింపు చేసే సినిమా

కొన్ని సినిమాలు మన ఆలోచనపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. మనని ఆలచోనలో పడేస్తాయి. అలాంటి సినిమానే ఈ వారం బాలీవుడ్ లో రిలీజైన "హమనే గాంధీ కో మార్ దియా". మహాత్మా గాంధీ 150 వ జన్మదిన వేడుకలు జాతీ జరుపుకుంటున్న వేళ..ఆయన ఆలోచనలు, సిద్దాంతాలు గుర్తు చేసుకోవటం ఖచ్చితంగా అవసరమే. అదే ఈ సినిమా చేసింది. నీమ్ .ఎ సిద్దిఖీ అనే దర్శకుడు రూపిందించిన  ఈచిత్రం గాంధీ ఫిలాసపీని,ఆయన అహింసా సిద్దాంతాన్ని ..,సమర్దవంతంగా మనకి మరోమారు మనకి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. 

నాన్ లీనియర్ నేరేషన్ లో చెప్పబడ్డ ఈ చిత్రం కోల్ కతా లో మొదలవుతుంది. జనవరి 1948న ఓ రోజున మొదలవుతుంది. దేశ విభజనాంతరం మత పరమైన విధ్వేషాలతో దేశం అట్టడుకుతున్న రోజులవి. ఆ మతపరమైన  విద్వేషాల్లో తన మిల్ ని  పోగొట్టుకున్న  కైలాస్ సింగ్ ఆర్దికంగా చాలా ఇబ్బందులు  పడుతూంటారు. తనని ఈ  పరిస్దితికి తెచ్చిన వారు అంటూ పరమత సహనం కోల్పతూ మాట్లాడుతూంటారు. అంతేకాక రాజకీయంగానూ ...తనకంటూ కొన్ని అభిప్రాయాలు బలంగా ఏర్పరచుకుంటాడు. ముఖ్యంగా వీటిన్నటికి కారణంగా మహాత్మాగాంధీని బ్లేమ్ చేస్తూంటాడు. తల్లి విభేధాలు వచ్చి కొలకతాకు వచ్చిన అతను తిరిగి బీహార్ లోని తన సొంత గ్రామం ససూరామ్ వెళ్లాలని తన భార్య సుధ, కుమార్తె తో కలిసి ట్రైన్  ప్రయాణం పెట్టుకుంటాడు. ఈ ప్రయాణం నిజానికి ప్రధాన  పాత్ర  అంతర్గత ప్రయాణం అని సినిమా పూర్తయ్యే సరికి మనకు అర్దమవుతుంది. ఈ జర్నిలో కలిసే వ్యక్తులతో మాట్లాడే మాటలు,జరిగే సంఘనటలు కైలాస్ సింగ్ లో మార్పులు తీసుకువస్తాయి. గాంధీపై అతనికి ఉన్న అనుమానాలు, అపనమ్మకాలు అన్నీ మటు మాయమైపోతాయి. ముఖ్యంగా అతనికి పూర్తిగా వ్యతిరేకమైన  దివాకర్ త్రిపాఠి అనే కో పాసెంజర్ ఐడియాలజీ వల్ల అతనితో పూర్తి స్దాయి మార్పు వస్తుంది.  అదేలా జరిగింది అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది

ఇక ఈ సినిమా.. ఆప్పటి కాలాన్ని మనుష్యులను ,అప్పటి పరిస్దితులను, మనస్దత్వాలని , ఆలోచనలను ప్రతిబింబించటంలో ఫెరఫెక్ట్ గా ఉంది. అలాగే ఎక్కడా గాంధీని చూపకుండా గాంధీ మీద సినిమా తీయటమూ గొప్ప విషయమే. అయితే వచ్చిన చిక్కల్లా చాలా స్లోగా నడిచే నేరేషన్, ముఖ్యాగా ఫస్టాఫ్ మరీ డల్ గా ఉండటము. అయితే సినిమాని ఇష్టపడటం మొదలెట్టాక అవి పెద్ద సమస్యలు అనిపించవు.  

"హమనే గాంధీ కో మార్ దియా" సినిమా టైటిల్ చూసి మహాత్మాగాంధీని చంపిన వారి కన్ఫెషన్ లాంటి  ఏదో  పొలిటికల్ డ్రామా... చూడబోతున్నాం అని వెళ్తే మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ అవుతారు. గాంధీ సిద్దాంతాలు, ఆలోచనలు, చర్యలుపై ఉన్న అపోహలు ని తొలిగించేందుకు ప్రయత్నించిన సినిమా ఇది. ఆ కోణంలో ఈ  సినిమా చూస్తే నచ్చుతుంది.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments